అగ్నిప్రమాదానికి ఇల్లు ద‌గ్ధం.. తీర‌ని న‌ష్టం

Share On

రూపాయి.. రూపాయి కూడ‌బెట్టి ఇంట్లో ఉన్న ఆడ‌పిల్ల పెళ్లి చేయాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఇర‌వై నాలుగు గంట‌లు క‌ష్ట‌ప‌డుతారు త‌ల్లిదండ్రులు.. అందుకోసం ఉన్న ఆస్తిని సైతం అమ్మి పెళ్లి చేసే వారు ఉన్నారు. త‌మ కూతురు ఆనంద‌మే త‌మ ఆనంద‌మ‌ని భావించే వారే త‌ల్లిదండ్రులు. కూతురు పెళ్లి నిశ్చ‌యించారు. ఇంకా కొన్నిరోజుల్లో పెళ్లి తంతు ఉంది. కాని ఆ అగ్నిదేవుడికి ఎందుకు కోపం వ‌చ్చిందో ఏమో తెలియ‌దు కాని ఆ పెళ్లి ఇల్లుతో పాటు, క‌ట్నం, పెళ్లి వ‌స్తువుల‌ను అన్నింటిని బూడిద చేసి ఆ కుటుంబానికి క‌న్నీరు మిగిల్చారు.

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం హంస కాలనీలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వారాడ కృష్ణమూర్తి, బొడ్డు గోపాల్‌కు చెందిన ఇళ్లు కాలిపోయాయి. షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన ఈ ప్రమాదంలో కృష్ణమూర్తికి చెందిన రూ. 9.20 లక్షల నగదు, ఏడు తులాల బంగారం ఆభరణాలు కాలిబూడిదైనట్లు అగ్నిమాపక అధికారి ఐవీ రామయ్య తెలిపారు. కుమార్తె వివాహం కోసం సిద్ధం చేసిన నగదు, బంగారంతోపాటు టీవీ, విలువైన వస్తువులు కాలిపోవడంతో కృష్ణమూర్తి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు కాని పెళ్లికి సంబంధించిన వ‌స్తువుల‌న్నీ కాలిపోవ‌డంతో వారి క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *