Share On

ఏ ఆఫీసు ఐతే వాళ్ల‌కేంటి.. ప్ర‌తినెల ఇంట్లో ఉన్నందుకు కిరాయి క‌ట్టాలి.. క‌నీసం ఐదారు నెల‌ల‌కోసారైనా ఇంటి అద్దె చెల్లించాలి.. ఎప్పుడు వెళ్లి అడిగినా ఇంకా బిల్లు రాలేదు. అద్దె మంజూరు కాలేద‌ని చెపుతూ దాటవేస్తున్నారు కాని అద్దె మాత్రం చెల్లించ‌ట్లేదు. ఇంటి య‌జ‌మాని అడిగి అడిగి, ఆ ఇంట్లో ఉన్న అధికారులు చెప్పిందే చెప్పి విసుగు తెప్పిస్తున్నార‌ని ఏకంగా ఇంటికే తాళం వేశాడు. అదీ కుటుంబం ఉంటే ఇల్లు కాదు, ఒక మండల రెవెన్యూ కార్యాల‌యం న‌డిచే త‌హ‌శీల్దార్ ఆఫీస్‌కే తాళం వేశారు.

కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాల‌యం ఉన్న ఇంటికి గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా కిరాయి కట్టకపోవడంతో బిల్డింగు య‌జ‌మానికి కోపం వ‌చ్చింది. వీరు మంచిగ చెపుతే విన‌ట్లేద‌ని ఏకంగా బుధవారం రాత్రి త‌హ‌శీల్దార్ ఆఫీసుకు తాళం వేశాడు. గురువారం ఆఫీసుకు వచ్చిన అధికారులకు తాళం కనబడటంతో విషయం బయటకు పొక్కకుండా తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇంటి య‌జ‌మానిని బుజ్జగిద్దామని ఫోన్‌‌‌‌ చేశారు. ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో బిల్డింగ్‌‌‌‌ను కిరాయికి ఇప్పించిన మధ్యవర్తి సాయంతో ఓనర్‌‌‌‌తో మాట్లాడారు. మూడేండ్లుగా రూ.11లక్షల కిరాయి రావాల్సి ఉందని, ఎప్పుడు అడిగినా రేపు, రేపంటూ తమని వేధించడం ఎంత వరకు న్యాయ‌మో అధికారులే చెప్పాల‌ని య‌జ‌మాని ప్ర‌శ్నించాడు. ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామ ని అధికారులు హమీ ఇవ్వడంతో ఆ బిల్డింగ్ య‌జ‌మాని వెన‌క్కి త‌గ్గి తాళం తీయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!