Share On

ఒక ప‌క్క క‌రోనా వ‌ణికిస్తోంది.. ప‌లువురి ప్రాణాలు గాలిలో క‌లుస్తున్నాయి.. నిబంధ‌న‌లు పాటించాల‌ని, జాగ్ర‌త్త‌లు తీసుకొవాల‌ని ప్ర‌భుత్వాలు ఎంత చెప్పినా ప్ర‌జ‌లు మాత్రం ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యంగా ఉన్నారని కొన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు క‌ఠిన నిర్ణ‌యాలు చేపడుతున్నారు. కరోనా కట్టడి కోసం నిబంధనలను పాటించని వారిపై మరింత కఠినంగా చర్యలు చేపట్టేందుకు రాజ‌స్ధాన్ ప్ర‌భుత్వం అన్ని సిద్దం చేసింది. ముఖ్యంగా మాస్క్ ధరించని వారిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మాస్క్ లేకుండా కనబడితే, ఏలాంటి వారెంట్‌తో సంబంధం లేకుండా వారిని అరెస్ట్‌ చేస్తామని సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్ సిర్మూర్ తెలిపారు. నేరం రుజువైతే వారికి ఎనిమిది రోజుల జైలు శిక్షతోపాటు రూ.5 వేల రూపాయల జరిమానా కూడా విధిస్తామని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎనిమిది జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధించింది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!