ఈ రాత్రే దాడి చేస్తాం.. నువ్వు ఏం చేయలేవు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా ఈ రాత్రే సైనిక దాడి చేసే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ చేస్తున్న చర్యలపై నేను సంతోషంగా లేను. ఇది ప్రభుత్వ మార్పు గురించి కాదు. కానీ ఇరాన్ అణ్వాయుధాలను పొందడం మాకు అస్సలు ఇష్టం లేదు. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ జరిపిన దాడులు తాత్కాలిక ఒప్పందానికి విరుద్ధం. మా ఒప్పందం ప్రకారం ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలి. లేకపోతే మేమే దాన్ని నిలిపివేస్తాం” అని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ నౌకాదళానికి చెందిన అడ్మిరల్ హబీబుల్లా సయ్యారి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. ఇరాన్ సైనిక శక్తిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, “ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని, ఇరాన్ తీరాల్లో ఆధిపత్యం చెలాయిస్తామని, హోర్ముజ్ జలసంధిలో అత్యాధునిక యుద్ధనౌకలను మోహరిస్తామని ట్రంప్ గతంలో ఎన్నో గొప్పలు చెప్పారు. కానీ ఆ ప్రణాళికలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు” అని విమర్శించారు.