కేరళలో పురుషుల వినూత్న నిరసన

కేరళలో కొంతమంది పురుషులు తమను తాము రక్షించుకోవడానికి బస్సుల్లో సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నారు. “మేము ఎవరినీ తాకడం లేదు, తప్పు చేయడం లేదు” అని ముందే రుజువు చేసుకునే ప్రయత్నం ఇది. మరికొందరు అయితే అట్ట పెట్టెలు శరీరానికి అడ్డుగా పెట్టుకుని ఎవరిని తాకకుండా బస్సుల్లో నిలబడుతున్నారు. ఓ మహిళ తనను అసభ్యంగా తాకాడంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఒక పురుషుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఇలా వినూత్న నిరసనలు చేస్తున్నారు.