దేశంలో ఎస్ఐఆర్ వివాదంపై రోజుకు ఆందోళన జరుగుతోంది. విపక్షాలు సీఈసీగా జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీలో తీవ్ర ఆందోళనలు చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం సీఈసీ రాజీనామా, తొలగింపుపై మానం వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ వివాదాలు తలెత్తిన సమయంలోనే ఈసీలో ఓటర్ల జాబితా, ఐటీ విభాగాల బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సంజయ్ కుమార్ ను ఈ ఏడాది ఆగస్టులోనే ఆయన మాతృ క్యాడర్ కు కేంద్రం పంపేసింది. ఇప్పుడు ఆయన స్ధానంలో మరో కొత్త డిప్యూటీ కమిషనర్ ను నియమించింది.
కేంద్ర ఎన్నికల సంఘంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ (DEC) పదవికి 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రకాష్ రాజ్‌పురోహిత్‌ను కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ తాజాగా నియమించింది. ఓటర్ల జాబితా, ఐటీ విభాగాల బాధ్యతలు చూస్తున్న అప్పటి డీఈసీ సంజయ్ కుమార్‌ను ఆగస్టులో ఆయన మాతృ కేడర్‌కు తిరిగి పంపడంతో ఏర్పడిన ఖాళీని ఈ నియామకంతో భర్తీ చేశారు. సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం రాజస్థాన్ కేడర్‌కు చెందిన 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాజ్‌పురోహిత్, సంజయ్ కుమార్ స్థానంలో ఏప్రిల్ 8, 2030 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన ఈ ఏడాది మే నెల నుండి రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రక్షణ ఉత్పత్తి విభాగంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!