దసరా నవరాత్రులు అంటేనే భక్తి, పారవశ్యం, అమ్మవారికి సమర్పించే రకరకాల ప్రసాదాల కలయిక. నవరాత్రులలో రెండవ రోజున జగన్మాతను సౌతిండియాలో.. శ్రీ గాయత్రీ దేవిగా అలంకరిస్తారు. గాయత్రీ దేవిని వేదమాత అని పిలుస్తారు. ముక్కోటి దేవతల శక్తుల కలయికగా, సకల మంత్రాలకు మూలశక్తిగా ఆమెను ఆరాధిస్తారు.

నవరాత్రులలో పవిత్రమైన రెండవ రోజున అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యంగా రవ్వ పులిహోరను సమర్పించడం ఆనవాయితీ. సాధారణంగా మనం బియ్యం లేదా అటుకులతో చేసే పులిహోరను రుచి చూస్తుంటాము. కానీ బియ్యం రవ్వతో చేసే ఈ పులిహోర ఎంతో పొడిపొడిగా, కమ్మగా, అద్భుతమైన రుచితో ఉంటుంది. తయారీ కూడా చాలా ఈజీగా ఉంటుంది.