సోషల్ మీడియాలో తాజాగా ఈ జాబితాలో చేరాలని కాంగ్రెస్ జాతీయ నాయకురాలు సోనియాగాంధీ సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యారు. గతంలో అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తింపు సొంతం చేసుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. తన రాబోయే పుస్తకం ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ గురించి అభిమానులతో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోతోనే ఆమె అకౌంట్ ఓపెన్ చేయడమే కాకుండా వీడియోతో పాటు ఫోటోలను షేర్ చేశారు. సోనియాగాంధీ ఇన్‌స్టా ఐడీ కూడా తన పేరుతోనే పెట్టుకున్నారు. ప్రేమ, బాధ్యత, నష్టాలు, తనకంటూ ఓ స్థానం వెతుక్కున్న ప్రయాణం ఇందులో ఉంటుందని తన పుస్తకంలో వెల్లడించారు.
ఈ పుస్తకం నవంబరు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 544 పేజీల ఈ పుస్తకంలో సోనియా తన వ్యక్తిగత జీవితంలోని కీలక ఘట్టాలను వివరించనున్నారు. సోనియాగాంధీ 1965లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో విద్యార్థినిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీని కలుసుకోవడంతో ఈ కథ మొదలవుతుంది. 1968లో వీరి వివాహం జరిగింది. అనంతరం సోనియా భారత్‌కు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భర్తను కోల్పోవడం, పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకోవడం వంటి వాటిని పుస్తకంలో పొందుపర్చినట్లుగా తెలుస్తోంది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!