ప్రపంచంలో ఒక్కొ దేశానికి ఒక్కో గుర్తింపు, ఒక్కో ప్రత్యేకత, కొన్ని ప్రత్యేక రూల్స్ ఉంటాయి. కాని ఒక దేశంలో మాత్రం ప్రజల ఆలోచనలకు, అవసరాలతో సంబంధాలు లేకుండా అక్కడ నియంత ఏది చెపితే అది జరగాల్సిందే. లేదంటే కఠిన శిక్షలు అమలు చేస్తారు. అలాంటి దేశమే ఉత్తర కొరియా..
ఉత్తర కొరియా ప్రభుత్వం ఇప్పుడు తమ దేశ ప్రజలపై విదేశీ సంస్కృతి ప్రభావం పడకుండా ఉండేందుకు అనేక ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యంగా అమెరికా సంస్కృతి అంటే అస్సలు ఇష్టపడరు. జీన్స్‌ను కూడా అందులో భాగంగానే చూస్తోంది. విదేశీ అక్షరాలు ముద్రించిన టీషర్టులు, కొన్ని రకాల ఫ్యాషన్ దుస్తులు, జుట్టు అలంకరణల విషయంలోనూ అక్కడ ఆంక్షలు ఉన్నాయి. ప్రజలు తమకు నచ్చిన దుస్తులు ధరించడం వ్యక్తిగత స్వేచ్ఛగా భావించే ఇతర దేశాలతో పోలిస్తే ఉత్తర కొరియాలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన నియమాలకు అనుగుణంగా జీవించాల్సి ఉంటుంది.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మొదట అధికారులు ప్రశ్నించడం, హెచ్చరించడం వంటి చర్యలు తీసుకుంటారు. ఇంకా మాట వినకపోతే కఠినమైన శిక్షలు విధిస్తారు. నీలిరంగు జీన్స్ ధరించిన వారికి జైలు శిక్ష పడే అవకాశాలు చాలా ఎక్కువ. ఉత్తర కొరియాలో విదేశీ సంస్కృతి ప్రభావాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి నియంత్రణలు అమలు చేస్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో జీన్స్ సాధారణ దుస్తులుగా మారిపోయాయి. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ఈ దుస్తులు అతి పెద్ద వివాదం.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!