తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2020 నుంచి 2025 వర‌కు ఇసుక లారీల వ‌ల్ల జ‌రిగిన ప్ర‌మాదాలు ఎన్ని. ఎంత‌మందికి గాయాలు అయ్యాయి. ఎంత‌మంది చ‌నిపోయారు. వారి వివ‌రాల‌ను జిల్లాల వారీగా అందించాల‌ని తెలంగాణ మైన్స్ డిపార్ట్‌మెంట్‌కు యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ నుంచి స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేయ‌డం జ‌రిగింది. అందుకు సంబంధించిన స‌మాచారాన్ని టీజీఎండిసి కార్యాల‌యం పంప‌డం జ‌రిగింది. ఆ స‌మ‌చారాన్ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ పౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి విడుద‌ల చేశారు.

తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా ఇసుక లారీల ప్ర‌మాదాల కార‌ణంగా 2020 నుంచి 2025 వ‌ర‌కు చ‌నిపోయిన వారు 46 మంది కాగా, గాయాల‌పాలైన వారు 10 మంది అని స‌మాచారం ఇవ్వ‌డం జ‌రిగిందని వారు తెలిపారు. 


తెలంగాణ రాష్ట్రంలో ఇసుక లారీలు అంటేనే ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ప‌ట్ట‌ప‌గ‌లు, అర్థ‌రాత్రి అనే తేడా లేకుండా ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా చాలా గ్రామాలు ఇసుక లారీల ప్ర‌భావం వ‌ల‌న బ‌య‌టికి రావాలంటేనే భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. విద్యార్థుల‌కు, వృద్దుల‌కు ఇసుక లారీల రాక‌పోక‌ల వ‌లన ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. ఇసుక లారీల కోసం ప్ర‌భుత్వం నిర్ణీత స‌మ‌యం అంటూ ఒక‌టి ఏర్పాటు చేయాలి.. దాంతో ఇసుక లారీలు వ‌చ్చే ఏరియాలో ప్ర‌త్యేక సిబ్బందిని నియ‌మించి, వాటి వేగాన్ని అదుపుచేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది. ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వం మీద‌నే విష‌యం మ‌ర్చిపోకూడ‌దని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ ఫౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి తెలిపారు.