నెల్లూరు: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతి సందర్భంగా కావలి MLA కావ్య కృష్ణారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. శనివారం కావలిలోని TDP కార్యాలయంలో నిర్వహించిన కార్య క్రమంలో MLA మహాత్మా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుల వివక్ష నిర్మూలన, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ఆయన కృషి చేశారని తెలిపారు. నేటి తరం పూలే ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహానీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఫూలేకు ఎమ్మెల్యే కావ్య నివాళులు
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!