బెల్లంపల్లి: పట్టణంలోని మూడో వార్డు అంబేద్కర్‌నగర్‌లో రజకుల కులదైవం మడేలయ్య స్వామి ఆలయ నిర్మాణానికి శనివారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మాట్లాడుతూ.. స్వామివారి విగ్రహాన్ని తామే సమకూరుస్తామని తెలిపారు. రజకుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఆలయాన్ని నిర్మిస్తామన్నారు. నిర్మాణానికి ప్రజలు, రజక సంఘం నాయకులు, వ్యాపారులు సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు పెండ్యాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నస్పూరి భీమయ్య, సంఘ నాయకులు, సభ్యులు, బస్తీవాసులు పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!