రాజన్న సిరిసిల్ల జిల్లా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల JAC నాయకులు నేడు మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల JAC అధ్యక్షుడు పులి లక్ష్మణ్ అన్న ఆదేశాల మేరకు ఎంపీని కలిసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి న్యాయమైన డిమాండ్లను వివరించారు.

ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ స్థాయిలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం JAC నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల JAC నాయకులు తెలిపారు.