హైదరాబాద్

తెలంగాణ పోలీస్‌ శాఖలో సీనియారిటీ వివాదాల పరిష్కారానికి డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన 1991, 1995, 1996 బ్యాచ్‌ల ఎస్‌ఐలతో సమావేశమై చర్చించారు. తక్షణమే 54 అదనపు ఎస్పీ పోస్టులను భర్తీ చేయాలని, 12 మంది అదనపు ఎస్పీలకు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు.