హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం తంగలపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్యా బోధన, వసతులు, భోజన నాణ్యత తదితర అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు.
తనిఖీలో భాగంగా పదవ తరగతి గదికి వెళ్లిన మంత్రి విద్యార్థినులతో నేరుగా ముచ్చటించారు. వారి చదువు, ఉపాధ్యాయుల బోధనా తీరును అడిగి తెలుసుకున్నారు. మ్యాథ్స్ సబ్జెక్టుకు సంబంధించిన సమస్యలను విద్యార్థినులతో బోర్డుపై పరిష్కరింపజేసి వారి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థినులు చదువులో మరింత ప్రతిభ కనబరిచేందుకు అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో వాష్రూమ్ సమస్య ఉందని విద్యార్థినులు మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో విద్యార్థినులు తన దృష్టికి తీసుకువచ్చిన తాగునీటి సమస్యను పరిష్కరించిన విషయాన్ని వారు గుర్తుచేయడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!