ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ మహిళా ఎంపీలు కలిసి కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చాను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని వారు కోరారు. బీజేపీ ఎంపీ పురందేశ్వరి ఆధ్వర్యంలోని ఎంపీల బృందం రాష్ట్రపతిని కలిసింది. మణిపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అంగోమ్చా బిమోల్ ఎంపీగా గెలిచారు. ఆయన ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా కూడా పని చేస్తున్నారు. అయితే, ఆయన విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు గత మే నెలలో యూనివర్సిటీ నిర్వాహకులకు ఫిర్యాదు అందింది. దీనిపై యూనివర్సిటీ ఇంటర్నల్ కమిటీ విచారణ జరిపింది. విద్యార్థినులను తన ఇంటికి రమ్మనడం, ఆ తర్వాత వారితో అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడ్డట్లు బాధితులు తెలిపారు.
ఈ విచారణలో అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు తేలడంతో వెంటనే అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఇతర చట్టపరమైన చర్యలకు సిఫారసు చేసింది. దీంతో ఈ అంశం ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది. సోమవారం హిమాచల్ ప్రదేశ్‌లో కూడా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుట కూడా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ నిరసన ప్రదర్శనలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి కూడా పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!