స‌ర్‌లో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు ఆరోపిస్తూ రాహుల్ గాంధీ త‌న పిటీష‌న్ దాఖ‌లు చేసేందుకు సుప్రీంకు వెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే మీడియా క‌వ‌రేజీ కోసం వ‌చ్చిన ప్ర‌తినిధుల‌తో రాహుల్ దురుసుగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. వ‌న్ఇండియా న్యూస్ వెబ్‌సైట్ జ‌ర్న‌లిస్టు రిచా పరాశ‌ర్ త‌న‌పై దాడి జ‌రిగిన‌ట్లు ఆరోపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె ఢిల్లీలోని ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. తాను మూడు నెల‌ల గ‌ర్భిణి అని రిచా వెల్ల‌డించారు.

రాహుల్ గాంధీ త‌న చేయిని లాగి కింద‌ప‌డేలా చేశాడ‌ని ఆమె త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసిన వీడియోలో చెప్పారు. త‌మ కెమెరామ‌న్‌ను కూడా రాహుల్ కింద‌ప‌డేలా లాగిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గేటు వ‌ద్ద రాహుల్ గాంధీ బైట్ కోసం ప్ర‌య‌త్నించాన‌ని, ఆ స‌మ‌యంలో త‌న మైక్‌ను రాహుల్ ప‌క్క‌కు నెట్టివేశార‌ని, అయితే ఆ త‌ర్వాత మిగితా మీడియా సంస్థ‌లు కూడా త‌మ మైక్ పెట్ట‌డంతో ఆయ‌న మాట్లాడే ప్ర‌య‌త్నం చేశార‌ని, ఆ స‌మ‌యంలో త‌న మైక్‌ను మ‌ళ్లీ రాహుల్ ముందు పెట్టేందుకు ప్ర‌య‌త్నించినప్పుడు త‌న‌ను తోసివేసిన‌ట్లు జ‌ర్న‌లిస్టు రిచా తెలిపారు.