పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఈరోజు మంగ‌ళ‌వారం ఉద‌యం ప్యాసింజ‌ర్ రైలు ప‌ట్టాలు త‌ప్ప‌డంతో ఆరుగురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రో 30 మంది గాయ‌ప‌డ్డారు. మంగళవారం ఉదయం కరాచీ నుంచి పెషావర్‌ వెళ్తున్న రెహమాన్‌ బాబా ఎక్స్‌ప్రెస్‌.. ముల్తాన్‌లోని షేర్‌ షా బ్రిడ్జి సమీపంలో పట్టాలు తప్పింది. రైలులోని 14 కోచ్‌లు పట్టాలు తప్పాయని అధికారులు తెలిపారు. ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారి మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి పంపించార‌ని చెప్పారు. గాయ‌ప‌డిన వారు వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని అన్నారు. ప్యాసింజ‌ర్ రైలు ప‌ట్టాలు త‌ప్ప‌డంతో ఆ మార్గంలో రాక‌పోక‌లు నిలిచిపోయాయ‌ని చెప్పారు. రైళ్ల రాక‌పోక‌లు పున‌రుద్ధ‌రించే ప‌నులు కొన‌సాగుతున్నాయ‌ని అన్నారు.