రాంచీ: జార్ఖండ్‌లోని చత్రా జిల్లా తాండ్వాలో ఉన్న ఎన్టీపీసీ నార్త్ కరణ్‌పురా థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లో నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మృతులు మరియు క్షతగాత్రులు సింప్లెక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ మరియు థైసెన్‌క్రుప్ (Thyssenkrupp) కాంట్రాక్ట్ సంస్థలకు చెందిన వారని అధికారులు తెలిపారు. గాయపడిన బాధితులకు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని ఎన్టీపీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.