2026 అక్టోబర్ 28న జస్టిస్ సుంద్రేశ్, జస్టిస్ వరాలే ధర్మాసనం ఇద్దరు దోషుల జీవిత ఖైదు శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వారికి బెయిల్ మంజూరైంది.
బిల్కిస్ బానో ఆవేదన
ఈ నిర్ణయం గురించి తనకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, తన అభిప్రాయాన్ని కూడా కోర్టు తెలుసుకోలేదని బిల్కిస్ బానో వెల్లడించారు. మీడియా కథనాల ద్వారానే బెయిల్ విషయం తెలుసుకున్నానని తెలిపారు.
ఈ పరిణామంతో 2002 నాటి భయాలు మరోసారి వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా న్యాయం కోసం చేసిన పోరాటం మళ్లీ ప్రశ్నార్థకంగా మారుతోందని అన్నారు. తనతోపాటు కుటుంబం, పిల్లల భద్రత గురించి ఆందోళన కలుగుతోందని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై తనకున్న నమ్మకం దెబ్బతింటుందేమోనని భయపడుతున్నట్లు తెలిపారు. తన వాదన వినకుండానే బెయిల్ ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వులను న్యాయస్థానంలో సవాల్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!