షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సముచిత అవకాశాలు కల్పిస్తూ వారి అభ్యున్నతికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.
ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే నేతృత్వంలో సభ్యులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న విధానాలు, తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి వివరించారు.
రాజకీయ రంగంలోనూ ఎస్సీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. శాసనసభ స్పీకర్ పదవితో పాటు మంత్రివర్గంలోనూ దళితులకు అవకాశం కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు వివిధ కార్పొరేషన్లలోనూ ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!