దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశానికి చెందిన ద్వీపంలో స్నేక్ ఐలాండ్ ఉంది. దీని అసలు పేరు ఇల్హా డా క్యూయిమాడ గ్రాండే. ఇది సావో పాలో రాష్ట్రంలోని ఇటన్హేం తీరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. దాదాపు 43 హెక్టార్లు అంటే 106 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ద్వీపం చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది. అయితే ఇక్కడ నివసించే విషపూరితమైన పాముల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ ద్వీపంలో ప్రధానంగా గోల్డెన్ లాన్స్హెడ్ వైపర్ అనే అరుదైన విషసర్పం నివసిస్తుంది. దీని శాస్త్రీయ నామం బోథ్రోప్స్ ఇన్సులారిస్. ప్రపంచంలో మరెక్కడా సహజంగా కనిపించని ఈ జాతి కేవలం క్యూయిమాడ గ్రాండే ద్వీపానికే పరిమితం కావడం విశేషం. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఈ ద్వీపంలో సుమారు 2,000 నుంచి 3,000 వరకు గోల్డెన్ లాన్స్హెడ్ పాములు ఉండవచ్చని తెలుస్తోంది. మొత్తంగా ఈ ద్వీపంలో 4,30,000 పాములు ఉంటాయని ఓ అంచనా... అంటే ఈ 106 ఎకరాల ద్వీపంలో నేలపై, చెట్లపై ఎక్కడ చూసినా పాములే కనిపిస్తాయన్నమాట. తక్కువ విస్తీర్ణంలో భారీగా విషసర్పాలు నివసిస్తున్నాయి... అందుకే ప్రపంచంలో అత్యధిక పాముల సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఈ ద్వీపం ఒకటిగా నిలిచింది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!