ఇకపై రైల్వే స్టేషన్ కౌంటర్లలో నేరుగా రిజర్వేషన్ (PRS) టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు సైతం ఆప్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ విస్తరిస్తున్నారు. అక్టోబర్ 27, 2026 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తుందని రైల్వే బోర్డు ప్రకటించింది. కేవలం 45 పైసల ప్రాథమిక రుసుముతో లభించే ఈ బీమా పథకం ద్వారా అవాంఛనీయ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు రూ.10 లక్షల వరకు ఆర్థిక బీమా రక్షణ పొందవచ్చు.
రైలు ప్రమాదం లేదా ఇతర అవాంఛనీయ సంఘటనల వల్ల ప్రయాణికుడు మరణించినా లేదా గాయపడి శాశ్వత అంగ వైకల్యం ఏర్పడినా గరిష్ఠంగా రూ.10 లక్షల బీమా వర్తిస్తుంది. శాశ్వతంగా పాక్షిక అంగ వైకల్యం ఏర్పడితే రూ.7.50 లక్షల పరిహారం ఇస్తారు. హాస్పిటల్ ఖర్చుల కోసం రూ.2 లక్షలు, మృత దేహాన్ని తరలించేందుకు రూ.10 వేలు చెల్లిస్తారు. ఈ బీమా కొనుగోలు చేసే ప్రయాణికులు ఖచ్చితంగా మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీమియం డిజిటల్ పేమెంట్ పద్ధతిలో చెల్లించాలి. టికెట్ ఛార్జీలతో పాటే దీనిని చెల్లించాలి. రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్‌కు బీమా వివరాలు అందుతాయి.
రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద టికెట్ కొనుగోలు చేసేటప్పుడు పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ బీమా అనేది ఆప్షనల్. అంటే పూర్తిగా ప్రయాణికుడి స్వచ్ఛంద నిర్ణయం. కౌంటర్ సిబ్బంది బీమా గురించి అడిగినప్పుడు కావాలని కోరుకుంటే ప్రీమింయ మొత్తం 45 పైసలు టికెట్ ఛార్జీతో కలిపి డిజిటల్ పద్దతిలో చెల్లించాల్సి ఉంటుంది. బీమా వివరాలు, ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ లింక్ ప్రయాణికుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా వస్తాయి.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!