హన్మకొండ: రాష్ట్ర JAC ప్రధాన కార్యదర్శి డి. శ్రీధర్ పిలుపు మేరకు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల JAC రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, జిల్లా బీసీ సంఘం ముఖ్య నాయకులు డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ ఇటీవల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా హన్మకొండ జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల JAC కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు చిరు సత్కారం నిర్వహించారు.
గుజరాత్ పర్యటన ముగించుకొని హన్మకొండకు తిరిగి వచ్చిన డాక్టర్ కుసుమ సూర్య కిరణ్‌ను ఈ సందర్భంగా JAC నాయకులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రిని కలిసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కీర్తి, రాష్ట్రానికి సంబంధించిన అంశాలను జాతీయ స్థాయిలో తెలియజేసే అవకాశం లభించడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!