మంచిర్యాల: కాసిపేట మండలంలోని తాటిగూడ గ్రామపంచాయతీలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం సుకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మడావి వెంకటేష్ మాట్లాడుతూ.. స్మార్ట్ కార్డులతో రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రౌతు సత్తయ్య, రత్నం ప్రదీప్, పుత్తూరి సత్తయ్య, రేషన్ డీలర్ జానకి-శంకర్, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
తాటిగూడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!