హైదరాబాద్: 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న గోదావరి పుష్కరాలకు అధికారిక లోగో మరియు ట్యాగ్‌లైన్ రూపకల్పన కోసం తెలంగాణ దేవాదాయ శాఖ పోటీలను నిర్వహిస్తోంది.
నగదు బహుమతులు: రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక చేసిన ఉత్తమ డిజైన్లలో మొదటి బహుమతి కింద రూ. 1,00,000, రెండో బహుమతి రూ. 50,000, మూడో బహుమతి రూ. 25,000 అందజేస్తారు. వీటితో పాటు ఎంపికైన టాప్ 100 ఎంట్రీలకు దేవాదాయ శాఖ తరపున ప్రత్యేక ప్రశంసాపత్రాలు ఇస్తారు.
అర్హులు: 18 ఏళ్లు నిండిన వారు వ్యక్తిగతంగా గానీ లేదా గరిష్టంగా ముగ్గురు సభ్యుల బృందంగా గానీ ఈ పోటీలో పాల్గొనవచ్చు.
నిబంధనలు: ప్రతి ఎంట్రీలో లోగోతో పాటు తెలుగు లేదా ఇంగ్లీష్ (లేదా రెండు భాషల్లో) గరిష్టంగా 5 పదాలకు మించకుండా ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్, అలాగే ఆ డిజైన్ వెనుక ఉన్న ఆలోచన (Concept) గురించి సంక్షిప్త వివరణ జతచేయాలి.
ఎంట్రీలు పంపాల్సిన విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 30, 2026 సాయంత్రం 5 గంటల లోపు తమ లోగో, ట్యాగ్‌లైన్ డిజైన్లను [email protected] మెయిల్ ఐడీకి పంపించాలని అధికారులు సూచించారు. నేరుగా లేదా పోస్టు ద్వారా పంపాలనుకునే వారు బొగ్గులకుంట తిలక్ రోడ్డులోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అందజేయవచ్చు. పూర్తి మార్గదర్శకాలు endowments.ts.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!