పోలీస్ శాఖలో విధులు నిర్వహించే ప్రతి అధికారి క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, పారదర్శకతతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు. పోలీస్ విధులపై క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన పెంపొందించుకొని, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేయాలని ప్రొబేషనరీ డీఎస్పీలకు దిశానిర్దేశం చేశారు.
ఇటీవల డీఎస్పీల నియామకాల్లో ఎంపికైన ఐదుగురు ప్రొబేషనరీ డీఎస్పీలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 వారాల పాటు నిర్వహించనున్న ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా సోమవారం పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సీపీ వారితో ప్రత్యేకంగా మాట్లాడి శిక్షణ కాలాన్ని ఎంతో విలువైనదిగా భావించి, ప్రతి అంశాన్ని ఆసక్తితో నేర్చుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ పనితీరు, పోలీస్ స్టేషన్ల నిర్వహణ, నేరాల దర్యాప్తు విధానాలు, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ డీఎస్పీలు ధారావత్ సభిత, పల్లేటి సాయి ప్రత్యూష్ రెడ్డి, బుషిరెడ్డి శంతన్ కుమార్ రెడ్డి, రావిరాల యశశ్వినీ, జేరిపోతుల ఆంజనేయులు పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!