హైదరాబాద్: ఐటీ ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, విద్యార్థులు, స్టార్టప్ సంస్థల బృందాలకు ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని మసీద్‌బండ మాధవ హిల్స్ పార్కును ‘వర్క్ ఫ్రమ్ పార్క్’గా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టారు.
CMC కమిషనర్ జి. సృజన, IAS ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ మాధవ హిల్స్ పార్కును సందర్శించి, అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను, ప్రతిపాదిత మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పార్కును ఆధునిక సౌకర్యాలతో కూడిన పర్యావరణహిత కార్యస్థలంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఐటీ నిపుణులు, ఫ్రీలాన్సర్లు, విద్యార్థులు, స్టార్టప్ బృందాలు ప్రకృతి మధ్య కూర్చొని తమ విధులు నిర్వహించుకునేలా అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!