హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు యువ పారిశ్రామికవేత్త, స్వతంత్ర మైక్రోఫిన్ చైర్పర్సన్ అనన్య బిర్లా ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని శనివారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో జరిగిన చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అనన్య బిర్లా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై కూడా ఆసక్తి కనబరిచారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అనన్య బిర్లాను ఆహ్వానించారు.
తెలంగాణను పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పారిశ్రామికవేత్తల నుంచి లభిస్తున్న మద్దతు ప్రాధాన్యత సంతరించుకుంది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!