Peddapalli
పెద్దపల్లి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కాడు. పెద్దపల్లి జిల్లా ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టులో టెన్యూర్ పద్ధతిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న దొంకెన రవీందర్ రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రైవేట్ వ్యక్తి రెడ్డిరాజుల రాజయ్యను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఏసీబీ విడుదల చేసిన ప్రెస్ నోట్ నం.176 ప్రకారం.. బుధవారం (18-11-2026) కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు పెద్దపల్లి పట్టణంలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ దొంకెన రవీందర్ నివాసంలో దాడి నిర్వహించి ఇద్దరినీ పట్టుకున్నారు.
లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చని వెల్లడించారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!