ఇస్లామిక్ వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసర్చ్ ఫౌండేషన్ సంస్థపై నిషేధాన్ని కేంద్ర హోంశాఖ మరో అయిదేళ్ల పాటు పొడిగించింది. దేశ భద్రతకు భంగం కలిగించే అంశాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు ఉన్నట్లు కేంద్రం పేర్కొన్నది. శాంతి, మత సామర్యానికి ఆ సంస్థ వల్ల విఘాతం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ చెప్పింది. యూఏపీఏ చట్టంలోని సెక్షన్ 3లోని సబ్‌సెక్షన్ 1 కింద ఐఆర్ఎఫ్‌ను చట్టవ్యతిరేక సంస్థగా హోంశాఖ ప్రకటించింది. యూఏపీఏ ట్రిబ్యునల్ దీనికి ఆమోదం తెలిపింది. గతంలో విధించిన బ్యాన్ నవంబర్ 14వ తేదీన ముగియనున్నది. ఐఆర్ఎఫ్, దాని సభ్యులు, ముఖ్యమంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్.. తన మద్దతుదారులను రెచ్చగొడుతున్నారని, సమాజంలో మతోన్మాదాన్ని సృష్టించే రీతిలో జకీర్ చర్యలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
జాతీయం
జకీర్ నాయక్‌పై నిషేధం పొడిగింపు
క్రెడిట్: Mundadugu Desk
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!