బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లిబర్టీ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాకా విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, గత 13 ఏళ్లుగా బీజేపీ రాజ్యాంగంపై కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!