కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన గడ్డం ఇందుప్రియను కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కామారెడ్డిలోని  ఇందుప్రియ నివాసానికి వెళ్లిన ఆకుల కల్పన ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో, ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాలు, రాజకీయ సాధికారత కోసం మహిళా కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో ఉంటూ ఉద్యమించాలని అన్నారు.