దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న భక్తుల రాక మాత్రం తగ్గడం లేదు. పరమశివుడిని దర్శించుకోవడానికి, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రుద్ర ప్రయాగ్ జిల్లా యంత్రాంగం కేదార్‌నాథ్ ధామంతోపాటు మొత్తం యాత్రా మార్గంలోని పరిస్థితులను కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తోంది. అక్కడి పరిస్థితులపై రుద్ర ప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) విశాల్ మిశ్రా మీడియాతోమాట్లాడుతూ.. కేదార్ నాథ్ ఆలయాన్ని ఇప్పటివరకు సుమారు 19 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. నవంబర్ 11వ తేదీ ఉదయం నుంచి కేదార్ నాథ్ ధామ్ ఆలయ ద్వారాలు మూసివేయడం జరుగుతుంది. ఈ టైంలో కేదార్ నాథ్‌కు యాత్రకు రావాలనుకునే భక్తులు, ఇక్కడ ప్రస్తుతం విపరీతమైన చలి ఉందని, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయిన విషయాన్ని గమనించాలని సూచించారు.
ఇలాంటి పరిస్థితిలో యాత్రకు వచ్చే భక్తులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వాతావరణానికి తగ్గట్టుగా వెచ్చని దుస్తులను ధరించాలని,,, అవసరమైన మందులను కూడా వెంట ఉంచుకోవాలని సూచించారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!