ముందడుగు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : దీపావళి పండుగ సందర్భంగా తలమడుగు మండలం సకినాపూర్, నడింపల్లి గ్రామాల్లో నిర్వహించిన దండోరా కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఆడే గజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆదివాసీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు గోక గణేష్‌రెడ్డి, బొల్లారపు బాబన్న, మండల పార్టీ అధ్యక్షుడు ప్రతాప్, ఆత్మ చైర్మన్ నారాయణ, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!