ముందడుగు/ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా స్థాయిలో 11, మండల స్థాయిలో 9 కలిపి మొత్తం 20 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. 30 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. బాలబాలికల వసతి గృహాల్లో భోజనం, మెనూ అమలు, రికార్డులు, మౌలిక వసతులపై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో స్రవంతి, డీఆర్డీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.