ముందడుగు/ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : బాధితుల ప్రతి సమస్యపై జవాబుదారీతనంతో వ్యవహరించి, సత్వర న్యాయం అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో 18 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి, సమగ్ర విచారణతో సమస్యలు పరిష్కరించాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాలపై 8712659973 వాట్సాప్ నంబర్‌కు సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
తెలంగాణ
ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
క్రెడిట్: Mahesh. mundadugu adilabad
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!