హైదరాబాద్: షామీర్పేటలోని 99వ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌లో సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత బ్యాండ్ పోటీల్లో తెలంగాణ పోలీస్ పైప్ బ్యాండ్ సత్తా చాటింది. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలు, బలగాలకు చెందిన బ్యాండ్ బృందాలు పాల్గొన్న ఈ పోటీల్లో తెలంగాణ పోలీస్ పైప్ బ్యాండ్ రెండో స్థానం సాధించి రజత ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఈ ఘనత పట్ల తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, ఐపీఎస్ సంతోషం వ్యక్తం చేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర పోలీస్ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన బ్యాండ్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. వారి కృషి, క్రమశిక్షణ, సమన్వయం, నిరంతర సాధన ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని ప్రశంసించారు.
గత వారం డీజీపీ సీవీ ఆనంద్ ఈ అఖిల భారత బ్యాండ్ పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఆరు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బ్యాండ్ బృందాలు పాల్గొన్నాయి. ఆరు రోజుల పాటు సాగిన పోటీల్లో బృందాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సంగీత ప్రతిభ, లయబద్ధమైన ప్రదర్శన, క్రమశిక్షణ, సమష్టి కృషి వంటి అంశాల్లో బృందాలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాయి.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!