ఢిల్లీ: ఓట్ చోరీ' పేరిట దేశవ్యాప్త ప్రచారాన్ని వచ్చే నెల మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించనున్నారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీ ఆదివారం గుణలో మీడియాకు వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడుకోవడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని జీతూ పట్వారీ స్పష్టం చేశారు. ఓటు హక్కు పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వచ్చే నెలలో దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, అర్హులైన ఓటర్ల పేర్లను భారీగా తొలగించడం, ఎన్నికల సంఘం పనితీరులో పారదర్శకత లోపించడం వంటి అంశాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ 'ఓట్ చోరీ' ఆరోపణలతో పోరాటానికి సిద్ధమైంది.
అంతకుముందు గుణకు చేరుకున్న జీతూ పట్వారీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్తో కలిసి శివపురి జిల్లాలోని పోహ్రీకి బయలుదేరారు. గిరిజన వీరుడు బిర్సా ముండా 152వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కైలాష్ కుష్వాహా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వీరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉమంగ్ సింఘార్ కూడా హాజరయ్యారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!