హైదరాబాద్: నాంపల్లి గాంధీభవన్లో ఆదివారం నిర్వహించిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఏఐసీసీ ఇన్ఛార్జ్ బి.ఎం. సందీప్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యవర్గ సభ్యులకు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడంపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!