వికారాబాద్ జిల్లా పరిగిలో అరుదైన వైద్య ఘటన వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలుడి శరీరంలో గర్భాశయం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న బాలుడిని తల్లిదండ్రులు ఛత్రజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతడి అంతర్గత అవయవాల్లో గర్భాశయం ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు.
వైద్య పరిభాషలో ఈ అరుదైన జన్యుపరమైన సమస్యను ‘పర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్’ (PMDS) అంటారని వైద్యులు తెలిపారు. అనంతరం బాలుడికి శస్త్రచికిత్స నిర్వహించి గర్భాశయాన్ని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడని, ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వేగంగా కోలుకుంటున్నాడని వైద్యులు వెల్లడించారు. ఈ అరుదైన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!