హైదరాబాద్: రైతుబంధు పథకం కింద తమకు అందాల్సిన నిధులు అందలేదంటూ ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందిన రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైతుబంధు పథకం కింద సుమారు రూ.7 లక్షల నిధులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రైతులకు రైతుబంధు నిధులు ఎందుకు అందలేదనే అంశంపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీంతో రైతుబంధు నిధుల చెల్లింపుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!