హైదరాబాద్: నగరంలో శుక్రవారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 6.30 గంటల వర్ష సూచన ప్రకారం పశ్చిమ, మధ్య హైదరాబాద్ ప్రాంతాల్లో మరో 1–2 గంటల పాటు అడపాదడపా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.

పటాన్‌చెరు, ఆర్‌సీ పురం, అమీన్‌పూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్‌పల్లి, మాదాపూర్, బాలానగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, షేక్‌పేట ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

మరోవైపు, వర్షం కారణంగా హుమాయూన్ నగర్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి విద్యుత్ లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.