హైదరాబాద్: నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. నవంబర్ 27వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్య పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. తెలంగాణ వెదర్‌మ్యాన్ విడుదల చేసిన వర్షపాతం వివరాల ప్రకారం కూకట్‌పల్లిలో అత్యధికంగా 78.3 మి.మీ. వర్షం నమోదైంది.
ప్రధాన ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం:
* కూకట్‌పల్లి – 78.3 మి.మీ.
* సఫిల్‌గూడ – 75.3 మి.మీ.
* షేక్‌పేట్ – 67.3 మి.మీ.
* చర్లపల్లి – 63 మి.మీ.
* బోరబండ – 62.8 మి.మీ.
* మాదాపూర్ – 61.3 మి.మీ.
* ఏఎస్ రావు నగర్ – 54.3 మి.మీ.
* కేపీహెచ్‌బీ కాలనీ – 48 మి.మీ.
* మల్కాజిగిరి – 48 మి.మీ.
* కీసర – 46.8 మి.మీ.
* ఫిల్మ్‌నగర్ – 45.3 మి.మీ.
* మౌలాలి – 43 మి.మీ.
* కాప్రా – 42.3 మి.మీ.
* బలానగర్ – 30.8 మి.మీ.
* మాసబ్‌ట్యాంక్ – 25.8 మి.మీ.
* కుత్బుల్లాపూర్ – 16 మి.మీ.
* అమీర్‌పేట్ – 15.8 మి.మీ.
* నాంపల్లి – 14 మి.మీ.
దాదాపు 28 రోజుల విరామం తర్వాత హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురవడంతో నగర వాసులకు ఉపశమనం లభించింది. నవంబర్ నెలలో గత పదేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతంగా నిలిచినట్లు తెలంగాణ వెదర్‌మ్యాన్ పేర్కొంది. భారీ వర్షాలతో రోడ్లపైకి వరద నీరు చేరే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!