ముందడుగు ఆదిలాబాద్ ప్రతినిధి : ఆదివాసుల అస్తిత్వం, ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు, హక్కుల పరిరక్షణ కోసం డిసెంబర్ 9న మానుకోటలో నిర్వహించనున్న ఆదివాసీ అస్థిత్వం, ధర్మం పోరాట మహాసభ, సాంస్కృతిక ర్యాలీని విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యాపల్గూడలో గ్రామ పటేల్, దేవరి, మహాజన్, సర్పంచ్, గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి మహాసభ ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా గోడం గణేష్ మాట్లాడుతూ ఆదివాసుల అస్తిత్వం అనేది కేవలం గుర్తింపు మాత్రమే కాదని, అది తమ చరిత్ర, సంస్కృతి, ధర్మం, భూమి, హక్కులు, జీవన విధానంతో ముడిపడి ఉందన్నారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
డిసెంబర్ 9న నిర్వహించే మహాసభ, సాంస్కృతిక ర్యాలీకి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీ ప్రజలు, యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామ పటేల్లు, దేవరిలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి వెట్టి మనోజ్, గ్రామ పటేల్ కోడప నారాయణ, మాజీ సర్పంచ్ కోడప లింగు, జిల్లా ఉపాధ్యక్షుడు పెందూర్ మనోహర్, భూర్నూర్ గ్రామ పటేల్ కుంర ముకుంద్ రావు, మత్తడిగూడ గ్రామ పటేల్ కంర మారుతి, రాములుగూడ గ్రామ పటేల్ మాడవి జంగు, మాజీ సర్పంచ్ దర్వ రాంచందర్, ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం గణపతి, రైతు సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆత్రం భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!