ఆదిలాబాద్: ఆదివాసి హక్కుల పోరాట సమితి–తుడుం దెబ్బ ఆధ్వర్యంలో డిసెంబర్ 9న హైదరాబాద్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో కరపత్రాలు, పోస్టర్లు విడుదల చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివాసుల అస్తిత్వం, హక్కుల చట్టాల అమలు, యువతీ యువకుల భవిష్యత్తు కోసం ఈ సభకు ఆదివాసీ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుర్క బాపురావ్ పిలుపునిచ్చారు.
25న సిరికొండలో ముఖ్య సమావేశం:
డిసెంబర్ 9న జరిగే చలో హైదరాబాద్ బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ నెల 25న సిరికొండ మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయం వద్ద ముఖ్య సమావేశం నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో ప్రచారం, జన సమీకరణ, వాహనాల ఏర్పాటు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి 9 తెగల ఆదివాసీ సంఘాల నాయకులు, రాయి సెంటర్ సార్మెడిలు, గ్రామ పటేల్స్, దేవారిలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!