ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యాంపూర్ గ్రామంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దాకూరి రాములు కుమారుడు దాకూరి ప్రశాంత్ కుమార్ వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.16,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును నాయకులు బాధిత కుటుంబానికి అందజేశారు.
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు కృతజ్ఞతలు:
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేయించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు చెక్కు అందుకున్న కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జగదీష్ జాదవ్, ఉట్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక సభ్యులు రాములు దాకూరి, పార్టీ నాయకులు మనోహర్, దుంగే దావూద్, ఆత్రం ప్రకాష్, దాసం కళ్యాణ్, జాడి రాజేశ్వర్, రమటెంకి రాజకుమార్, శేక్ తజోద్దీన్, పోతారాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!