హైదరాబాద్ సినీ ప్రదర్శన రంగంలో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మల్టీప్లెక్స్‌లు, ఓటీటీ వేదికల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు నగరంలోని సంప్రదాయ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆధునిక హంగులతో ముస్తాబవుతున్నాయి. ఈ క్రమంలో మియాపూర్‌లోని ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్ 'సాయిరంగ 70MM' అరుదైన ఘనత సాధించింది.

తెలంగాణలో తొలి సింగిల్ స్క్రీన్ ఇదే:


వాల్ట్ డిస్నీ స్టూడియోస్ అందించే ప్రతిష్ఠాత్మక 'ఇన్ఫినిటీ విజన్' సర్టిఫికేషన్ పొందిన తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి సింగిల్ స్క్రీన్ థియేటర్‌గా సాయిరంగ 70MM నిలిచింది. 2026లో డిస్నీ ప్రారంభించిన ఈ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (PLF) సర్టిఫికేషన్ పొందాలంటే కనీసం 45 అడుగుల వెడల్పు గల స్క్రీన్, 2K లేదా 4K లేజర్ ప్రొజెక్షన్, అధిక బ్రైట్‌నెస్ స్థాయిలు మరియు డాల్బీ అట్మాస్ (Dolby Atmos) లేదా 7.1 సరౌండ్ సౌండ్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ఈ ఘనతతో హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్, అపర్ణ సినిమాస్ వంటి ప్రీమియం థియేటర్ల జాబితాలో సాయిరంగ చేరింది.