డ్రగ్స్ రహిత సమాజం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన నషా ముక్త్ భారత్ వాక్‌లో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బృందం పాల్గొంది. మొదటి రోజు వాక్‌ను అంబర్‌పేట నుంచి ప్రారంభమైంది. కిషన్‌రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు, హీరో వెంకటేశ్ హజరయ్యారు. ఇందులో భాగంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం అవగాహన కల్పిస్తున్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బృందం కూడా ఇందులో భాగస్వామ్యులయింది. ఎంతో ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్న యువత మాదక ద్రవ్యాల బారిన పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటుందని, మన యువత భవిష్యత్తును కాపాడుకునేందుకు మనమంతా డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటు బడాల్సిన అవసరం ఉందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ప్రతినిధులు తెలిపారు. తమ వంతు ప్రయత్నంగా నషా ముక్త్ భారత్ కోసం పనిచేస్తూ ముందుకు సాగుతామని వారు తెలిపారు. సాధ్యమైనంత మేరకు అవగాహన సదస్సులు కల్పిస్తామన్నారు. ఈ వాక్‌లో వైఏసీ పౌండర్ రాజేంద్ర, బృందం జి. శ్రీధర్ రెడ్డి, జి. సాయికిరణ్, జి. రణధీర్ రెడ్డి, ఎస్. విక్రమ్, కొమటి రమేశ్‌బాబు, రాజామ్మద్, పాశిగంటి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నషా ముక్త్ భారత్ వాక్ లో యూత్ ఫర్ యాంటీకరప్షన్ బృందం
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!