హనుమకొండ: సహజ ప్రసవాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్, ఇండియా, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, హనుమకొండ సంయుక్త ఆధ్వర్యంలో ‘నేషన్‌వైడ్ వాక్ ఫర్ నేచురల్ బర్తింగ్’ కార్యక్రమాన్ని హనుమకొండలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన నడకను హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బజ్ , పోలీస్ కమిషనర్ శ్వేత జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య, నర్సింగ్ రంగాలకు చెందిన ప్రతినిధులు, నర్సింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, మిడ్‌వైవ్స్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ నడక ద్వారా సహజ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలు, గర్భిణులకు అందించాల్సిన నాణ్యమైన వైద్య సేవలు, ప్రసవ సమయంలో మిడ్‌వైవ్స్ పాత్ర, తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!